![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1067 లో.....ఇందు సీఈఓ అయింది కదా ఇక నువ్వు చెప్పినట్టు అసలు వినదని రేఖతో భ్రమరాంబ అంటుంది. మీరు ఎందుకు అలా నెగెటివ్ గా మాట్లాడుతున్నారని రేఖ వాళ్ళపై కోప్పడుతుంది. మరొకవైపు నందు బొకే డెలివరికి వెళ్తుంటే తన స్కూటీ ఆగిపోతుంది. దాంతో వెంకీకి ఫోన్ చేసి రమ్మంటుంది. ఇప్పుడు రాలేను.. నాకు అర్జెంట్ డెలివరీస్ ఉన్నాయని వెంకీ అంటాడు.
నందు కోపంగా నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేసానురా.. ఒక చిన్న హెల్ప్ చెయ్యమంటే చెయ్యట్లేదు నువ్వు సెల్ఫిష్ అని నందు అనగానే అంత మాటలు ఎందుకు వస్తున్నానని అంటాడు. నందు దగ్గరికి వెంకీ వెళ్లి తనని తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ఇందుకి 1000 టెంపుల్స్ రిమోడల్ డిజైన్ కోసం కాంట్రాక్టు వస్తుంది. ఇందు ఫైల్ పై సంతకం పెడుతుంది. సంతకం ఎలా పెడుతుందని రేఖ, భూషణ్ షాక్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు అడ్వాన్స్ గా యాభై లక్షలు ఇస్తారు. ఆ డబ్బుని నేను తీసుకుంటానని రేఖ అనుకుంటుంది. నేను తీసుకుంటానని రాజు అంటాడు.. అలా ఇద్దరికి ఇవ్వకుండా నేను ఎంప్లాయిస్ కి శాలరీ ఇస్తానని ఇందు వెళ్తుంది. అసలు ఈ ఇందు సంతకం ఎలా పెట్టిందని భూషణ్ అనగానే అవన్నీ ఇంటికి వెళ్ళాక డిస్కషన్ చేసుకుందామని రేఖ అంటుంది. మరొకవైపు వెంకీ తను చెయ్యాల్సిన ఫుడ్ డెలివరీ కోసం నందుతో కలిసి ఒక దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెంకీ లవ్ చేసిన అమ్మాయి ఉంటుంది. వెంకీ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే వెంకీకి సపోర్ట్ గా నందు మాట్లాడుతుంది. ఎంతో నందుకి వెంకీ ఫ్లాట్ అవుతాడు.
మరొకవైపు ఇందు ఆఫీస్ లో ఎంప్లాయిస్ ఒక్కొక్కరికి జీతాలు ఇస్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో డిజైన్స్ లేటుగా అవ్వాలి. నువ్వు అలా చేస్తే హాస్పిటల్ లో ఉన్న మీ అమ్మ ట్రీట్ మెంట్ కి డబ్బు నేను ఇస్తానని శృతితో రేఖ అంటుంది. దానికి శృతి సరే అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |